ఇండియన్ క్రికెట్ లో ఏమి జరుగుతూ ఉందో సామాన్యులకు అర్ధం కావడం లేదన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే మొన్న జరిగిన టీ 20 వరల్డ్ కప్ నుండి ఇండియన్ టీమ్ లో ఒడిదుడుకులు బయటపడుతున్నాయి. ఇందుకు కారణాలు ఏమిటి అన్నది కరెక్ట్ గా ఎవరికీ తెలియకపోయినా లోపల ఏదో అవుతోంది అన్నది తెలుస్తోంది. టీ 20 వరల్డ్ కప్ లో దారుణ వైఫల్యం తర్వాత ఇండియన్ హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రికి బీసీసీఐ ముగింపు పలికింది. అతని స్థానంలో ఇండియన్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను నియమించింది. అయితే అప్పటి నుండి ఇండియన్ టీమ్ కు కష్టాలు మొదలయ్యాయి.

ఇండియన్ టీమ్ కు అన్ని ఫార్మాట్ లలో కెప్టెన్ గా ఉంటూ వచ్చిన విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ తోనే టీ 20 కెప్టెన్సీకి బై బై చెప్పేశాడు. ఇక ఆ తర్వాత వన్ డే కెప్టెన్ గా కూడా దిగిపోయాడు. ఇక రెండు రోజుల క్రితం సౌత్ ఆఫ్రికా పర్యటనకు వచ్చిన ఇండియా మూడు టెస్ట్ ల సిరీస్ ను 1-2 తో ఓడిపోవడంతో వెంటనే టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలను కూడా వదులుకున్నాడు. అయితే ఇండియా టీమ్ ను ఎంతో గొప్పగా తీర్చి దిద్దిన గ్రేట్ ప్లేయర్ విరాట్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో అటు జట్టు యాజమాన్యానికి ఇటు అభిమానులకు అంతుబట్టలేదు. దీనికి కారణాలుగా చాలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే వాస్తవం ఏమిటనేది విరాట్ కోహ్లీకే తెలియాలి. గత రెండు సంవత్సరాలుగా కోహ్లీ ఏ ఫార్మాట్ లోనూ సరైన ప్రదర్శన కనబరచడం లేదు. బహుశా ఇది ఒక కారణం కావొచ్చు. ఇన్నాళ్లూ కెప్టెన్ గా ఉండడం చేత జట్టులో చోటును దక్కించుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు కెప్టెన్ గా తొలగిపోవడంతో ఇకపై జట్టులో ఒక ప్లేయర్ గా రాణించకుంటే జట్టులో చోటుతో పాటు కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు.    

మరింత సమాచారం తెలుసుకోండి: