పాయె అంతా అయిపాయె.. ప్రస్తుతం భారత అభిమానులు అందరూ ఇదే అనుకుంటున్నారు.  భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు బయలుదేరిన సమయంలో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ విజయం సాధించి సౌతాఫ్రికా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఊహించని స్థితిలో టీమిండియా పేలవ ప్రదర్శన చేయడంతో చివరికి టెస్టు సిరీస్ చేజార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే టెస్టు సిరీస్ పోయింది ఇక వన్డే సిరీస్ మిగిలి ఉంది కదా.. వన్డే సిరీస్ మాత్రం మనదే ఇది రాసిపెట్టుకోండి అంటూ పక్కాగా చెప్పారు అభిమానులు. కానీ టీమిండియా అదే పేలవా ప్రదర్శన కొనసాగిస్తుంది అని మాత్రం ఊహించలేకపోయారు.



 టెస్ట్ సిరీస్లో పేలవ ప్రదర్శనతో సిరీస్ను చేజార్చుకున్న టీమ్ ఇండియాలో ఎక్కడ మార్కులు మాత్రం రాలేదు. వన్డే సిరీస్లో కూడా చేసిన తప్పులే చేస్తూ వరుసగా మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది టీమిండియా. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న టీమ్ ఇండియా మూడో మ్యాచ్ లో నైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మూడో మ్యాచ్లో కూడా ఓడి పరువు పోగొట్టుకొంది టీమిండియా. ఇక ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా  వన్డే సిరీస్లో సౌత్ ఆఫ్రికా చేతిలో క్లీన్స్వీప్ అయింది.


 ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేక సిరీస్ చేజార్చుకుంది. మూడో వన్డేలో నాలుగు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది టీమిండియా. ఇక ఈ మూడో వన్డే మ్యాచ్లో భాగంగా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 124 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో మూడో మ్యాచ్లో కూడా నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవాల్సినా పరిస్థితి ఏర్పడింది. 18 బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగుల అవసరమైన సమయంలో కూడా భారత్ చేతులెత్తేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సౌత్ఆఫ్రికా పర్యటనలో మొదటిసారి టీమిండియా క్లీన్స్వీప్ అయ్యి రికార్డును నమోదు చేసింది  

మరింత సమాచారం తెలుసుకోండి: