ఐసీసీ నిర్వహణలో జరుగుతున్న మ్యాచ్ లన్నీ కూడా పకడ్బందీగా జరుగుతుంటాయి. ఆట యొక్క స్ఫూర్తిని బ్రతికించడానికి ఐసీసీ కొన్ని నియమ నిబంధనలను రూపొందించుకుంది. ఐసీసీ ప్రకారం పొందుపరచబడిన నియమాలను ఏ క్రికెటర్ అయినా ఉల్లంఘిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు సరిగా అలాంటి ఒక సంఘటన జరిగి మనము ఇలా చర్చించుకోవడానికి కారణం అయింది. పూర్తి వివరాల లోకి వెళితే, నిన్న ఆఫ్గనిస్తాన్ మరియు నెదర్లాండ్ జట్ల మధ్య దోహా వేదికగా మూడవ వన్ డే జరిగిన విషయం తెలిసిందే.

అయితే అప్పటికే జరిగిన రెండు వన్ డే లలోనూ ఘోర ఓటమిని చవి చూసిన నెదర్లాండ్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని అనుకుంది. అందుకు తగినట్లే ఆడినా చివర్లో స్పిన్నర్లను సరిగా అంచనా వేయలేక కేవలం 70 పరుగుల లోపు 10 వికెట్లు కోల్పోయి హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఆఫ్గనిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నెదర్లాండ్ పేసర్ వివియన్ కింగ్ మా బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్లు ఐసీసీ తెలిపింది. సరిగ్గా ఆఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ లో 31 వ ఓవర్ లో కింగ్ మా బాల్ ను తన గోర్లతో గీకడం గమనించిన మ్యాచ్ రిఫరీ అతనిపై నాలుగు మ్యాచ్ ల నిషేధాన్ని విధించాడు. ఇప్పటి వరకు ఇలా చేసిన ఎంతో మంది క్రికెటర్లు శిక్షలను అనుభవించారు.

దీనితో వివియన్ కింగ్ మా ను అందరూ విమర్శిస్తున్నారు, మ్యాచ్ గెలవడానికి ఇలా కూడా చేస్తారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రకంగా ఐసీసీ నెదర్లాండ్ క్రికెటర్ పై నియమావళి ఉల్లంఘన కింద కొరడా జులిపించింది. ఇకపై ఏ క్రికెటర్ ఇలా చేయకుండా ఉండాలంటే ఇలాంటి కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే అంటూ నెటిజన్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: