లెజెండరీ సింగర్ ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్ ఇక లేరు అన్న విషయాన్ని సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. తన గాత్రంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుని దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు సేవలందించిన ఆమె గొంతు ఇక వినలేం అనే మాట కూడా తట్టుకోలేక పోతున్నారు ఎంతోమంది అభిమానులు.  అద్భుతమైన  సేవలతో ఏకంగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు లతా మంగేష్కర్. ఇటీవలే కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. దీంతో అభిమానులు అందరూ ఆందోళనలో మునిగిపోయారు.


 కానీ లతా మంగేష్కర్ కోలుకుని మళ్లీ తిరిగి వస్తారు అని అభిమానులందరూ భావించారు. దీని కోసం ఎన్నో పూజలు కూడా చేశారు. కానీ చివరికి లతా మంగేష్కర్ కన్నుమూశారు. లెజెండరీ సింగర్ మరణం పట్ల ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం లతామంగేష్కర్ కి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. కాగా లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అనే విషయం తెలిసిందే.


క్రికెట్ మ్యాచ్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా చూసేదానిని అని గతంలో ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పారు ఆమె..  అయితే ఒకసారి క్రికెట్ మ్యాచ్ లో టీమిండియా గెలవాలని ఉపవాసం కూడా ఉన్నట్లు చెప్పారు. 2011 లో భారత్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో లతా మంగేష్కర్ ఆమె కుటుంబంతో టీవీ ముందు కూర్చున్నారు.. ఇక టీమిండియా ఫైనల్లో విజయం సాధించాలని ఏకంగా నేనూ నా ఫ్యామిలీ మొత్తం ఒక మూఢ నమ్మకాన్ని ఫాలో అయ్యాము.. భారత్ గెలవాలని మ్యాచ్ పూర్తయ్యేంతవరకు ఏమీ తినకుండా ఉపవాసం పాటించాం.. నీళ్లు కూడా తాగలేదు.. ఎంతో టెన్షన్ పడ్డాం.. ఇక మ్యాచ్ గెలిచినా తర్వాత డిన్నర్ చేశాము అంటూ లతా మంగేష్కర్ గతంలో క్రికెట్ మీద ఆమెకున్న మక్కువను అభిమానులతో పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: