మొన్నటివరకు టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా కొనసాగిన రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో 3 ఫార్మాట్లకు కూడా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇక కెప్టెన్ గా మారిన తర్వాత ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూనే మరోవైపు జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్క సారి కూడా భారత జట్టు ఓటమిని చవిచూడలేదు అని చెప్పాలి.  ఎప్పటికప్పుడు తన దైన వ్యూహాలకు పదును పెడుతు స్వరూపాన్ని తన వైపు తిప్పుకోవడంలో రోహిత్ శర్మ సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. మొన్నటికి మొన్న వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు రాగా ఆ జట్టుతో వన్డే టి20 సిరీస్ ఆడింది టీమిండియా. ఈ రెండు సిరీస్ లలో కూడా ప్రత్యర్థి వెస్టిండీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఇప్పుడు శ్రీలంక తో టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మొదటి టి20 మ్యాచ్ లో 62 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా. ఇటీవలే రెండో టీ20 మ్యాచ్ లో కూడా విజయం సాధించింది. రెండో టీ20 మ్యాచ్లో విజయం తో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు.


 స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలి స్థానం లోకి ఎగబాకాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ టీమిండియా టి20 కెప్టెన్గా స్వదేశంలో కేవలం 15 విజయాలు మాత్రమే అందుకున్నాడు. అయితే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియం సన్ ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ లు కూడా ఇక ఇదే రీతిలో 15 విజయాలతో ఉన్నారు. అయితే ఇటీవలే శ్రీలంకతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్లో కూడా టీమిండియా విజయం సాధించడంతో ఇక 16వ విజయం రోహిత్ శర్మ ఖాతాలో చేరిపోయింది. దీంతో దేశంలో టి-20 కెప్టెన్గా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు రోహిత్ శర్మ..

మరింత సమాచారం తెలుసుకోండి: