ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి ఒక్కసారి కూడా టీమిండియా ఓటమి చవి చూడలేదు అని చెప్పాలి. రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత స్వదేశంలో వరుసగా సిరీస్ లు ఆడుతుంది టీమిండియా. ఇక అన్ని సిరీస్ లలో కూడా ప్రత్యర్ధి పై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తోంది. మొన్నటికి మొన్న వెస్టిండీస్ను వన్డే టి20 సిరీస్ లలో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక ఇప్పుడు శ్రీలంకతో టి20 సిరీస్ ను కూడా 3-0 తేడాతో గెలిచి క్లీన్స్వీప్ చేసింది. కెప్టెన్గా రోహిత్ వ్యూహాలపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు
అయితే సగటు బ్యాట్మెన్గా మాత్రం రోహిత్ మూడు మ్యాచ్లలో కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మాజీ ఆటగాడు సభ కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యత మాత్రమే. కెప్టెన్సీ వచ్చిందని రోహిత్ శర్మ బ్యాటింగ్ పై పట్టు కోల్పోకూడదు. అయితే జట్టును నడిపించే అదనపు బాధ్యత కారణంగా ఎంతో మంది కెప్టెన్లు బ్యాటింగ్ పై పట్టు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రోహిత్ విషయంలో మాత్రం ఇది జరగకూడదు . రోహిత్ కు కెప్టెన్గా ఇది ప్రారంభ దశ మాత్రమే జట్టుకు తన బ్యాటింగ్ ఎంతో అవసరం అన్న విషయాన్ని అతను గ్రహించాలి. ఆస్ట్రేలియా లో జరగబోయే టి20 ప్రపంచ కప్ లో రోహిత్ ప్రదర్శన ఎంతో కీలకం కానుంది. అక్కడ మైదానాలు చాలా పెద్దగా ఉంటాయి. ప్రత్యర్థి జట్టులో అత్యుత్తమ బౌలర్లు కూడా ఉంటారు. ఇక వాటిని ఎదుర్కొని కెప్టెన్గా రాణించడమే కాదు బ్యాట్స్మెన్గా కూడా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది అంటూ సభ కరీమ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి