అభిమానులందరిలో కూడా భారీ అంచనాలు పెంచేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ముందుగా బిసిసిఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26వ తేదీన సాయంత్రం ఏడున్నర గంటలకు మొదటి మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగడం గమనార్హం. అయితే గత ఏడాది ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఈ ఏడాది కూడా అద్భుతంగా రాణిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి మ్యాచ్ లోనే ప్రేక్షకులందరినీ కూడా నిరాశ పరిచింది అనే చెప్పాలి. జట్టులోని కీలక బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేయడంతో ఒకానొక సమయంలో కనీసం చెన్నై సూపర్ కింగ్స్ 100 పరుగులు అయినా చేస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.



 ఇక అలాంటి సమయంలోనే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో సారి ఫినిషర్ పాత్రను తీసుకొన్నాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేయడంతో చివరికి 20 ఓవర్లు ముగిసేసరికి 131 పరుగులతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఆ తర్వాత మాత్రం చెన్నై బౌలింగ్ విభాగం ఇక ఆ టార్గెట్ ను కాపాడుకోలేక పోయింది. చివరికి ఓటమి తప్పలేదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది టైటిల్ గెలవడంలో కీలక పాత్ర వహించాడు యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ . అంతేకాదు ఇక ఐపీఎల్ మొత్తం అద్భుతంగా రాణించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా కొనసాగాడు అన్న విషయం తెలిసిందే.



 ఇక అలాంటి రుతురాజ్ గైక్వాడ్  మొదటి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ అనుకుంటే చివరికి ఒక్క పరుగు కూడా  చేయకుండానే డగౌట్ అయ్యి వెనుదిరిగాడు. ఉమేష్ యాదవ్ వేసిన ఫస్టు ఓవర్లోనే నితీష్ రానా కు  క్యాచ్ ఇచ్చి చివరికి అభిమానులను నిరాశపరిచాడు. తొలి బంతికే నోబాల్ వేసి తడపడినట్లు కనిపించిన ఉమేష్ యాదవ్ ఆ తర్వాత మాత్రం పుంజుకొని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర వహించాడు. కాగా గత ఏడాది 45.53 యావరేజ్ తో 653 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్. మొదటి మ్యాచ్లో డగ్ అవుట్ అయిన సీఎస్కే ఓపెనర్ తర్వాత తర్వాత మ్యాచ్ లలో మాత్రం పుంజుకోవాలని  అభిమానులు కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl