ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలం లో ఎంతో మంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరొక జట్టు లోకి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఎన్నో ఏళ్ల పాటు ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లు సైతం చివరికి జట్టు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కోహ్లీ స్నేహితుడిగా కీలక  ఆటగాడిగా కొనసాగిన యుజువెంద్ర చాహల్ చివరికి మెగా వేలం కి ముందు అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లీ మాక్స్వెల్ మహమ్మద్ సిరాజ్ లను మాత్రమే రిటైన్ చేసుకోవడంతో చివరికి మెగా వేలంలోకి వెళ్ళిపోయాడు చాహల్.


 అయితే ఇక మెగా వేలంలో చాహల్ ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ కొనుగోలు చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక అతని కోసం బెంగళూరు జట్టు ఆసక్తి చూపించకపోవడం తో చివరికి రాజస్థాన్ జట్టు అతని సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే 2010లో రాజస్థాన్ జట్టులో కొనసాగాడు  చాహల్. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టులోకి వెళ్ళాడు అన్న విషయం తెలిసిందే. అయితే బెంగళూరు జట్టు నుంచి తప్పుకోవడంతో ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు చాహల్.


 జట్టుతో కొనసామని బెంగళూరు మేనేజ్మెంట్ బృందం లేదా కోహ్లీ అడిగి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకునే వాడిని అంటూ  చాహల్ చెప్పుకొచ్చాడు. నా మొదటి కుటుంబంతో తిరిగి కలవడం సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు. రాజస్థాన్ తరపున ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు. బెంగళూరు జట్టుతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఇక ఆ జట్టు తో బావోద్వేగ పూరితమైన బంధం ఏర్పరచుకొన్నా.. బెంగళూరుకి కాకుండా మరో జట్టు ఆడుతాను అని ఎన్నడూ కూడా ఊహించలేదు. అయితే ఎక్కువ డబ్బు డిమాండ్ చేసి ఆ జట్టు నుంచి వెళ్లిపోయానని సామాజిక మాధ్యమలలో అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. బెంగుళూరు యాజమాన్యం నాకు ఫోన్ చేసి కేవలం ముగ్గురిని మాత్రమే అంటిపెట్టుకున్నామని చెప్పారు. మెగా వేలంలో కొనుగోలు చేస్తామన్నారు. కానీ ఇక ఆ తర్వాత అది కుదరలేదు. డబ్బు ప్రాధాన్యత కాదు బెంగళూరు నాకు ఎంతో ఇచ్చింది. ఇప్పుడు వేరే జట్టులో ఆడబోతున్నంత మాత్రాన బౌలింగ్ మారదు.. జెర్సీ మాత్రమే మారుతుంది అంటూ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: