సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. మళ్లీ అదే రీతిలో నిరాశపరిచింది. మొన్నటి వరకు జట్టులో ఆటగాళ్ళ సరిగ్గా లేక సన్రైజర్స్ ఓటమి పాలు అవుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల జరిగిన మెగా వేలంలో ఎంతో మంది కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది సన్రైజర్స్ యాజమాన్యం. అయినప్పటికీ ఏ మాత్రం మార్పు రాలేదు అని చెప్పాలి. మొదటి మ్యాచ్లోనే సన్రైజర్స్ సత్తా ఏంటి అన్న విషయం తెలిసిపోయింది. అటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రతి బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా రాణిస్తూ పరుగుల వరద సారిస్తూ భారీ స్కోర్లు చేసారూ.


 సిక్సర్లు ఫోర్లతో  చెలరేగిపోయారు. ఇక ఇదంతా చూస్తుంటే ఇక ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ కూడా ఇదే రీతిలో చెలరేగిపోతారు. అత్యంత ఉత్కంఠ భరితంగా మ్యాచ్ మారిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ కేవలం 10 ఓవర్లలోనే మ్యాచ్ ఫలితం ఏంటి అనేది తేలిపోయింది. ఎందుకంటే భారీగా పరుగులు చేయాల్సిన సన్రైజర్స్ చతికిలబడి పోయింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది హైదరాబాదు జట్టు. దీంతో ఇక ఎంత ప్రయత్నించినా సన్రైజర్స్ గెలవడం మాత్రం కష్టమే అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు.


 ఇక మళ్లీ సన్రైజర్స్ నిరాశపరిచింది అని కాస్త అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఇక ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణమైన ఆటతీరుతో నిరాశపరిచిన సన్రైజర్స్ చెత్త కూడా నమోదు చేయడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా గతంలో 2009లో రాజస్థాన్ జట్టుపైనే ఉన్న రికార్డు ను మళ్లీ సన్రైజర్స్ అదే జట్టుపై తిరగరాసింది. 2009లో రెండు వికెట్లు కోల్పోయి 12 చేస్తే ఇక ఇప్పుడు మూడు వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది. ఏదేమైనా సన్రైజర్స్ ఆటతీరు లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: