ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతోంది ముంబై ఇండియన్స్. ఎందుకంటే తక్కువ సమయంలో నే ఏకంగా ఐదు సార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ కొనసాగుతోంది . రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్ తిరుగు లేదు అన్న విధంగా దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం 2022 ఐపీఎల్ సీజన్ లో ఓటమితో ముంబై ఇండియన్స్ తన ప్రస్థానం మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది.


 అయితే ఇలా ఐపీఎల్ సీజన్ లో మొదటి మ్యాచ్ లో ఓడిపోయినప్పుడు ఇక ఆ సీజన్ విజేతగా నిలుస్తూ వచ్చింది ముంబై ఇండియన్స్ దీంతో ఈసారి కూడా ముంబై ఇండియన్స్ కప్పు కొట్టడం పక్క అని నమ్ముతున్నారు ప్రేక్షకులు. కాగా ఇక ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2వ తేదీన తమ రెండవ మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ముంబైలో ఉన్న డివై  పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ తలబడ పోతుంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో ఓడినప్పటికి రెండో మ్యాచ్లో మాత్రం తప్పకుండా గెలవాలని కసితో ఉంది ముంబై ఇండియన్స్.


 ఇలా రెండో మ్యాచ్ కి ముందే ముంబై ఇండియన్స్ కి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా తొలి మ్యాచ్ కి దూరమైన ఆ జట్టు బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇక రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయే మ్యాచ్ కి మాత్రం అందుబాటులోకి రాబోతున్నాడు. అయితే గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్ కి ముందే జట్టులో చేరినప్పటికీ ఫిట్నెస్  సాధించకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో మళ్లీ ముంబై జట్టు లో చేరిపోయాడు. కాగా ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తరఫున ఎంతో విధ్వంసకర బ్యాటింగ్ తో భారీ పరుగులుచేసి సూర్యకుమార్ యాదవ్ జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: