యుజ్వేంద్ర చాహల్.. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి ఈ బౌలర్ సరిగ్గా సరిపోతాడు. టీమిండియా లోకి ఒక సాదాసీదా బౌలర్ గా ఎంట్రీ ఇచ్చిన చాహల్ ఇక ఇప్పుడు కీలక బౌలర్ గా ఎదిగాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తనను తాను కొత్తగా మలుచుకున్న తీరు ఎంతో మందికి స్పూర్తిని ఇస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇతను స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయగలడా అనే స్థాయి నుంచి చాహల్ బౌలింగ్ వేస్తే తప్పకుండా వికెట్ దక్కుతుంది అని అనుకునే స్థాయికి ఎదిగాడు. స్పిన్ బౌలింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు యుజ్వేంద్ర చాహల్.



 ఇక టీమిండియాకు అవసరమైనప్పుడల్లా తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉండేవాడు. ఇక మొన్నటివరకు ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కొనసాగిన యుజ్వేంద్ర చాహల్ మేక వేలంలో ఆ జట్టు అతని వేలం లోకి విడుదల చేయడంతో రాజస్థాన్ జట్టులోకి వచ్చేసాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక స్పీన్నర్గా తనతోటి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో కలిసి జట్టు విజయం కోసం కష్టపడుతున్నాడు. ఇక ప్రతి మ్యాచ్లో కూడా కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ  ఉన్నాడు  చాహల్.



 ఇకపోతే ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో జట్టుతో మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో చివరికి రాజస్థాన్ విజయం సాధించింది.. ఇక ఈ మ్యాచ్ లో అటు ఇటు చాహల్ అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ హిస్టరీ లో 150 వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాహుల్ లక్నో తో మ్యాచ్ లో చమీరా ను అవుట్ చేయడం వల్ల ఈ ఘనత సాధించాడు. చాహల్ కంటే ముందు బ్రావో 173,మలింగా 170,అమిత్ మిశ్రా 166  , పియూష్ చావ్లా  157, హర్భజన్ సింగ్ 150 వికెట్లతో తొలి ఐదు స్థానాల్లో ఉన్నాడు.. తొలి 50 వికెట్లకు 40 మ్యాచ్లు ఇక తర్వాత 50 వికెట్లకు 44 మ్యాచ్ లు,ఇక ఆ తర్వాత 50 వీటిలో కేవలం 34 మ్యాచ్లోనే సాధించాడు చాహల్..

మరింత సమాచారం తెలుసుకోండి: