ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రిఈ వ్యాఖ్యలు చేసాడు. కోహ్లీ మానసికంగా అలసిపోవడం ఆటపై ప్రభావం చూపిస్తుంది. 2019 నవంబర్ తర్వాత కోహ్లీ సెంచరీ చేయలేదు. అతను సెంచరీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్లో అయినా ఆ కోరిక తీరుస్తాడు అనుకుంటే నిరాశే ఎదురవుతుంది. సెంచరీ అందుకోవాలనే తాపత్రయంతో కోహ్లీ అంతకంటే ఎక్కువ ఒత్తిడిలో నలిగిపోతున్నాడూ. ఏమైనా ఆటగాడి పట్ల సానుభూతితో ఉండాలి. అనవసరంగా ఒత్తిడి తీసుకు రాకూడదు అంటు రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు
ఇక కోహ్లీ ఒత్తిడిని జయించడానికి అతనికి కొన్నాళ్లపాటు విశ్రాంతి కావాలి. ఇంగ్లండ్ పర్యటనకు ముందు అయినా సరే లేదా ఆ తర్వాత అయినా సరే రెస్ట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా 7 ఏళ్లపాటు క్రికెట్ ఆడే సత్తా అతనికి ఉంది. ఇలాంటి సమయంలో ఒత్తిడితో ఆటకు దూరం కాకూడదు. కేవలం కోహ్లీ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న క్రికెటర్లు చాలామంది ఉన్నారు అంటు రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి