ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ ఉంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ టైటాన్స్ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడి పోయింది. ఆ ఒక్క మ్యాచ్ ఓడింది కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో కావడం గమనార్హం. అయితే మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా ఐదు విజయాలతో ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ రెండు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరగబోతోంది.
మొదటి సారి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ పైచేయి సాధించి విజయం తో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలకు బ్రేక్ వేసింది. మరి నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరం గా మారి పోయింది. ఒకవైపు సన్రైజర్స్ మరోవైపు గుజరాత్ కూడా వరుస విజయాల తో దూసుకు పోతు ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తూ ఉన్నాయి. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ మరింత ఆసక్తికరం గా మారి పోయింది అని చెప్పాలి. ముంబై వేదికగా సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. చూడాలి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అని..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి