ఇటీవలి కాలంలో ఐపీఎల్లో భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లందరూ కూడా తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కనీస ప్రదర్శన చేయలేక తమ కోసం ఫ్రాంచైజీ పెట్టిన ధరకు న్యాయం చేయలేక తీవ్ర ఇబ్బందులు పడిపోతు న్నారు. అయితే ఇలాంటి వారిలో ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ కూడా ఒకడు. గత ఐపీఎల్ సీజన్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తొలి దశ పోటీలో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. కాని కరోనా వైరస్ తర్వాత రెండవ దశలో మాత్రం  కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనే అనుమానం కలిగింది. అలాంటి సమయంలో వెంకటేష్ అయ్యర్ రాకతో ఆట స్వరూపమే మారిపోయింది.


 ఎవరూ ఊహించని విధంగా ఏకంగా కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఫైనల్ వరకు వెళ్లి చివరికి అడుగు దూరంలో బోల్తాపడి రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే కోల్కతా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెంకటేష్ అయ్యర్  దూకుడైన ఆటతీరు కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. 10 మ్యాచ్ లలో 128 స్ట్రైక్  రేటుతో 370 పరుగులు చేశాడు  ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు..  మూడు వికెట్లు కూడా ఉండడం గమనార్హం.


 దీంతో అతనిపై ఎంతో నమ్మకంతో 8 కోట్లకు రిటైర్డ్ చేసుకుంది కోల్కతా నైట్రైడర్స్ జట్టు. కానీ ఈ సారి మాత్రం వెంకటేష్ అయ్యర్ ఘోరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన వెంకటేష్ అయ్యర్ 132 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముంబై ఇండియన్స్ పై చేసిన 50 పరుగులు మినహాయిస్తే మిగతా ఎనిమిది మ్యాచ్లలో 82 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇలా ఒకప్పుడు హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ అయ్యర్  ఇప్పుడు కోల్కతా జట్టుకు విలన్ గా మారిపోయాడు అని చెప్పాలి. బ్యాటింగ్ లో మాత్రమే కాదు అటు బౌలింగ్ లో కూడా పెద్దగా రాణించలేక పోతున్నాడు...

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl