టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పుడూ సరదాగా సంభాషణలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులను తన పోస్టులతో అలరిస్తూనే వుంటారు. ఇటీవలే ఒక లైవ్ షోలో పాల్గొన్న ఈ మాజీ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టడం అటు మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ కు  అస్సలు ఇష్టం లేదు అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో పార్థివ్ పటేల్ పై బెంగుళూరు అభిమానులు ఆగ్రహానికి గురయ్యారూ అని చెప్పాలి.


 ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడుతూ వీరేంద్ర సెహ్వాగ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లీక్ స్టేజ్ దశలో ముంబై ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలవడం అటు పార్థివ్ పటేల్ కు అస్సలు ఇష్టం లేదని.. అలా జరగడం వల్ల బెంగళూరు జట్టు ఇంటిముఖం పడుతుందని ఆశించాడు అంటు సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అయితే చివరికి ముంబై గెలిచేది బెంగళూరు ప్లే ఆఫ్లో అడుగుపెట్టడంతో ఇక బెంగుళూర్ అభిమానులు తనపై మండిపడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు పార్థివ్ పటేల్.


 అయితే తాను ఎప్పుడూ కూడా బెంగళూరు జట్టు ప్లే ఆప్ లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను అంటూ వివరణ ఇచ్చాడు. నమ్మకం కలగాలంటే తన ఇంస్టాగ్రామ్ లో రీల్స్ కూడా చూడొచ్చు నేను మొదటి నుంచి బెంగళూరు జట్టు రెండవ స్థానంలో నిలవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కి వెళ్లడం నాకు నచ్చదు అని పుకార్లు ఎన్నో వచ్చాయని తెలిపాడు. అంతేకాకుండా ఇక బెంగళూరు ఢిల్లీ మధ్య మ్యాచ్ లో కూడా ముంబై గెలవాలని ఆ జట్టు జెర్సీ వేసుకుని స్టేడియంకు వెళ్లి మరీ సపోర్ట్ చేశాను అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు అందరూ కూడా శాంతించారు చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb