దాదాపు గత రెండు నెలల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. మరో రెండు మ్యాచ్ లు జరిగితే చాలు అటు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్లేఆఫ్ కి చేరిన 4 జట్ల మధ్య తొలి క్వాలిఫైర్, ఎలిమినేటర్ మ్యాచ్లు జరిగాయ్. ఇక తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్.. రాజస్థాన్ పై విజయం సాధించింది. ఈ క్రమంలోనే నేరుగా ఫైనల్కు చేరుకుంది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఉత్కంఠగా మారింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ప్లే ఆఫ్ లో ముందడుగు వేసింది. లక్నో పరాజయంతో ఇంటి బాట పట్టింది అని చెప్పాలి. కాగా నేడు రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో రాజస్థాన్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళ్లబోతుంది.



 కాగా ఇప్పటికే లక్నో జట్టుపై విజయం తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు  జోరు మీద కనిపిస్తూ ఉంది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవడంతో ఎంతో కసి పట్టుదలతో కనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. కాగా ఈ మ్యాచ్లో చూసుకుంటే కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, పటిదార్, మాక్స్వెల్ హసరంగా, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్ లాంటి వాళ్ళు బెంగళూరు జట్టుకు బలం కాగా.. ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడు గా కొనసాగుతున్న  బట్లర్, సంజు శాంసన్, హెట్మెయర్, అశ్విన్, బౌల్ట్,  చాహల్ ఈ ముగ్గురు కూడా కీలకం కాబోతున్నారు అని చెప్పాలి. ఇక ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠకు తెర పడాలంటే మ్యాచ్ వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: