
ఇక ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చింది. ఇక మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా మహిళల వన్డే జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ ను కెప్టెన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు బిసిసీఐ అధికారులు. అయితే ఇక రిటైర్మెంట్ తర్వాత ఇన్నాళ్ళ వరకు మిథాలీ రాజ్ కి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న వార్త ప్రస్తుతం తెరమీదికి వచ్చింది. అయితే 22 ఏళ్ల వయసులోనే మిథాలీ రాజ్ కు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు వెదకడం ప్రారంభించారు. ఇక క్రికెట్లో ఎంతో బిజీగా ఉన్న మిథాలీరాజ్ ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేస్తూ వచ్చిందట.
ఇక 30 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేసిందట మిథాలీరాజ్. ఇక 30 ఏళ్ల తర్వాత వచ్చిన పెళ్లి సంబంధాలలో ఎంతో మంది క్రికెట్ను వదిలేయాలి అంటూ ఒక కండిషన్ పెట్టారట. దీంతో అలాంటి వారు నాకు అవసరం లేదంటూ చెప్పేసి ఇక క్రికెట్ కెరీర్ కోసం తన పర్సనల్ లైఫ్ ని పెళ్లిని కూడా త్యాగం చేసిందట ఈ లెజెండరీ క్రికెటర్. అయితే పెళ్లి చేసుకొనందుకు తానేమీ బాధపడటం లేదని. సింగిల్ లైఫ్ ఎంతో సంతోషంగా ఉందని కొన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మిథాలీ రాజ్. పెళ్లైన వాళ్లను చూసిన తర్వాత సింగిల్ గా ఉండమని చాలా బెటర్ అనిపిస్తుంది అంటూ తెలిపింది.