ఒకప్పుడు టీమిండియాలో చోటు కోసం ఎదురు చూసే యువ ఆటగాళ్ల సంఖ్య కాస్త తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం భారత్లో క్రికెట్ అంతకుమించిన క్రేజ్ సంపాదించుకోవడంతో అటు ఎంతోమంది యువకులు కూడా క్రికట్ ను ప్రొఫెషన్ గా ఎంచుకుని అటు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే  భారతజట్టులో అవకాశం దక్కించుకోవాలని తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన ప్రదర్శన తో సెలెక్టర్లు చూపులు ఆకర్షిస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఇలా టీమిండియాలో అవకాశం తగ్గించుకోవాలి అనుకున్న ప్రతి యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఒక ఎంట్రెన్స్ టెస్ట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఆ తర్వాత తక్కువ కాలంలోనే టీమిండియాలో అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం టీమిండియా లో సీనియర్లుగా ఉన్న కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లు సైతం ఇలా టీమిండియా లోకి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇక ఇప్పుడు కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల సౌత్ఆఫ్రికాతో టీంఇండియా ఆడుతున్న టి20 సిరీస్ లో కొంతమంది యువ ఆటగాళ్లు అవకాశం దక్కించుకన్నారు.


 ఇక టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటన కోసం వెళ్లబోయే జట్టును ప్రకటించింది. ఇక ఈ జట్టులో మరికొంత మంది యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో బాగా రాణించిన రాహుల్ త్రిపాఠి ఎట్టకేలకు టీమ్ ఇండియా తరపున ఆడేందుకు అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఈ విషయంపై స్పందిస్తూ నా కల నిజమైంది. ఇది నాకు పెద్ద అవకాశం. నా హార్డ్ వర్క్ పై సెలెక్టర్ల నమ్మకం.. ఇండియా కు సెలక్ట్ అవ్వడం సంతోషంగా ఉంది. నాకు ఆడే అవకాశం వస్తే నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఐపీఎల్ లో 76 మ్యాచ్లు ఆడి 1768 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పరుగులు చేసిన అన్ క్యాప్డ్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు రాహుల్ త్రిపాఠి.

మరింత సమాచారం తెలుసుకోండి: