బీసీసీఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించినట్లు గానే అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ లీగ్ తో అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు పోటీ ఇవ్వాలని భావిస్తూ ఉంటుంది. కానీ అది కుదిరే పని కాదు అన్న విషయం మాత్రం దాదాపు అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా భాగం అవుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ అనుభవాలను ఉద్దేశించి ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జేసెన్ రాయ్  షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న రోజులలో భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నాను అంటూ జేసన్ రాయ్  చెప్పుకొచ్చాడు.  మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలతో బాధ పడ్డా అంటూ తెలిపాడు.  ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడినన్ని రోజులు నా జీవితంలో చీకటి రోజుగా భావిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. నెదర్లాండ్స్ తో రెండో వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ క్రికెటర్ జేసన్ రాయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ సూపర్ లీగ్ జరిగింది.


 కాగా ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా క్వీట్టా గ్లాడియేటర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు జేసన్ రాయ్. ఇక ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్లు గానే మంచి ప్రదర్శన చేశాడు అనే విషయం తెలిసిందే. తాను బాగా రాణించినప్పటికి ఎందుకో మానసిక ప్రశాంతతను మాత్రం పొందలేక పోయాను అంటూ కామెంట్ చేశాడు. క్రికెట్ ని ఎక్కడ ఆడిన కూడా ఎంతగానో ఎంజాయ్ చేసే నేను పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మాత్రం క్రికెట్ ఆటను ఆస్వాదించలేక పోయాను. ఎందుకో కారణం మాత్రం నాకు తెలియదు. కానీ పాకిస్తాన్లో ఉన్నని రోజులు మాత్రం నరకంలో ఉన్నట్లుగా అనిపించింది అంటూ తన అనుభవాలను ఇటీవల చెప్పుకొచ్చాడు. ఇక నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అంటూ తెలిపాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిధ్యం వహించాడు. కానీ సీజన్ ఆరంభం లోనే తప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: