ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్న ప్లేయర్స్ అందరూ కూడా ఆ తర్వాత ఏదో ఒక విధంగా క్రికెట్ తో సంబంధం కొనసాగిస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటించిన వారు ఆ తర్వాత కాలంలో కోచ్ గా మారడం లేదా జట్టుకు మెంటర్ గా వ్యవహరించడం వంటివి చేస్తూ ఉన్నారు  ఇకపోతే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఇటీవల కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తుంది. రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఒక ఆసక్తికర ప్రకటన చేశాడు.


 తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనే విషయంపై స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా అటు టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే టీ20 వన్డే సిరీస్ లు కూడా ఆడుతుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి ఇక తాను కామెంటేటర్ గా మారబోతున్నట్లు ఇయాన్ మోర్గాన్ ప్రకటించాడు. ఇక ఈ విషయాన్ని ఇయాన్ మోర్గాన్ తో ఒప్పందం కుదుర్చుకున్న స్కై నెట్వర్క్ అధికారికంగా ధ్రువీకరించడం గమనార్హం  ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తమ కామెంటరీ ప్యానల్ లో చేరబోతున్నాడు అంటూ ప్రకటన చేసింది.


 ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి. మొన్నటివరకు 13 ఏళ్ల పాటు అటు క్రికెట్ లో ఎంతగానో సేవలు అందించాడు. ఇంగ్లాండ్ జట్టుకు ప్రపంచ కప్ అందించిన కెప్టెన్గా కూడా రికార్డు సృష్టించాడు. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్ళీ క్రికెట్ తోనే కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు అనేది తెలుస్తుంది. ఏదేమైనా ఇటీవలే  కాలంలో రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు కామెంటేటర్ లుగా మారిపోతున్నారు.  ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇయాన్ మోర్గాన్ కూడా అదే దారిలో వెళ్ళాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: