ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ చివరి వరకు కూడా ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది. ఒకానొక సమయంలో అటు టీమిండియా విజయం సాధిస్తుంది అని అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు అద్భుతంగా రాణించడంతో చివరికి విజయం వారివైపు వెళ్ళిపోయింది. 378 పరుగుల లక్ష్యాన్ని అటు భారత బౌలింగ్ విభాగం రక్షించుకో లేకపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అటు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే అందరికీ నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే అటు మ్యాచ్ చూడడానికి వెళ్లిన భారత అభిమానులకు కూడా చేదు అనుభవం ఎదురైంది అన్నది తెలుస్తుంది. నాలుగో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో కొంతమంది ఇండియా అభిమానులను ఉద్దేశించి ఇంగ్లాండు అభిమానులు జాతి వివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అసభ్యకర రీతిలో వారిని దూషించడం గమనార్హం.


 ఈ మేరకు ట్విట్టర్ వేదికగా  ఒక యూజర్ స్పందించడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ అభిమానుల నుంచి తమకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ అభిమానులు తమ ను ఉద్దేశించి జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంపై అక్కడ స్టేడియం సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది అంటూ సదరు వ్యక్తి వాపోయాడు. అయితే తమతో పాటు అక్కడున్న మహిళలు చిన్నారుల భద్రత కూడా ప్రమాదంలో పడిందని.. సిబ్బందిలో ఒకరు  కూడా తమకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అంటూ ఆరోపించాడు. నాగరిక సమాజంలో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు అంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తోపాటు భారత క్రికెట్ నియంత్రణ మండలినీ కూడా ట్యాగ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఇందుకు చింతిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: