ఈ క్రమంలోనే కోహ్లీ పై విమర్శలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కోహ్లీకి కొన్నాళ్ళ పాటు రెస్ట్ ఇవ్వాలి అని సూచిస్తున్న వారు కొంతమంది అయితే వరుస వైఫల్యాలతో తో జట్టుకు భారంగా మారిపోతున్న కోహ్లిని పక్కన పెట్టడం బెటర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు మరికొంతమంది. ఈ క్రమంలోనే కోహ్లీ విషయంలో ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంటూ గతంలో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒక మీడియా సంస్థ తో మాట్లాడిన సునీల్ గవాస్కర్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తనకు కోహ్లీతో 20 నిమిషాల సమయం కేటాయిస్తే చాలని అతని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ ఏం చేయాలి అనే విషయాన్ని చెప్తాను అంటూ సునీల్ గవాస్కర్ తెలిపాడు. అయితే తాను చెప్పేవి కచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పడం లేదని.. కానీ ఉపయోగపడే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది అంటూ సునీల్ గవాస్కర్ అన్నాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ అవస్థలు పడే బంధువులనుఅవతల బంతులను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై విరాట్ కోహ్లీకి సలహాలు ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. తాను కూడా ఓపెనర్గా ఆడిన సమయంలో ఆఫ్ స్టంప్ బంతులకు ఇబ్బంది పడినట్లు గుర్తుచేసుకున్నాడు సునీల్ గవాస్కర్. ఇక ఇలా కోహ్లీతో ఈ విషయంపై చర్చించేందుకు 20 నిమిషాల సమయం కేటాయిస్తే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఒత్తిడిలో ఉన్న కోహ్లీ ప్రతి బంతికి పరుగులు తీయాలి అని భావించడం కారణంగానే ఇక ఇలా క్రికెట్ కోల్పోవడం జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి