ఇటీవలే మూడో వన్డే మ్యాచ్లో భాగంగా 98 పరుగులు చేసి అడుగు దూరం లో సెంచరీ మిస్ చేసుకున్నాడు యువ ఆటగాడు శుభమన్ గిల్.  ఈ క్రమంలోనే తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. టీమిండియా మూడో మ్యాచ్లో విజయం సాధించడంలో ఆతిథ్య వెస్టిండీస్ జట్టును క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.  ఇక మూడో వన్డే మ్యాచ్లో భాగంగా 119 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది టీమిండియా జట్టు. దీంతో  3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పాలి.


 ఇక కరేబియన్ గడ్డపై ఆతిథ్య వెస్టిండీస్ జట్టును ఇలా వరుసగా అన్నీ మ్యాచ్లో గెలిచి వైట్వాష్ చేయడం టీమిండియాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మూడు వన్డే మ్యాచ్ లలో కూడా మంచి పరుగులు చేసి ఆకట్టుకున్న శుభమన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ఇక మూడో మ్యాచ్లో 98 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ముఖ్యంగా మూడు మ్యాచ్ లలో 205 పరుగులు చేశాడు అన్న విషయం తెలిసిందే. శుభమన్ గిల్ 98 పరుగులు చేసిన నేపథ్యంలో ఒక ఆసక్తికర  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 సరిగ్గా మూడో వన్డే మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు తన బ్యాటింగ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు శుభమన్ గిల్. మ్యాచ్ కు ముందు మాట్లాడుతూ మంచి స్టార్ట్ లభిస్తూ ఉన్నప్పటికీ ఇక దానిని భారీ స్కోర్లు  చేయడంలో విఫలం అవుతున్నాను. స్కూప్ షాట్లు ఆడబోయి అనవసరంగా వికెట్లు పారేసుకోవడం ఎంతగానో బాధ కలిగిస్తోంది. ఇప్పటికి వన్డే బెస్ట్ స్కోర్ 68 పరుగులు మాత్రమే. దీనిని మార్చాల్సిన అవసరం ఉంది అంటూ తన బ్యాటింగ్ పై  అసహనం వ్యక్తం  చేసాడు. కట్ చేస్తే మూడో వన్డే మ్యాచ్లో 98 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. వర్షం ప్రభావం లేకపోయి ఉంటే శుభమన్ గిల్  సెంచరీ చేసేవాడే.

మరింత సమాచారం తెలుసుకోండి: