ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో సూర్యకుమార్ యాదవ్ తన ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడి వేగంగా 76 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులతో విఫలమైన సమయంలో 44 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలోని సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


 అతను ఒక అసాధారణమైన ఆటగాడు అంటూ హార్దిక్ పాండ్యా లాంటి తోటి ఆటగాళ్లు కూడా ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన ఇన్నింగ్స్ పట్ల తీవ్ర నిరాశకు లోనయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు. తాను చేసిన పరుగులు పట్ల సంతృప్తి గానే ఉన్నప్పటికీ ఆఖరి వరకు అజేయంగా నిలిచి మ్యాచ్ ముగించనందుకు మాత్రం నిరాశకు లోనయ్యా అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్. ఇటీవలే ఇషాన్ కిషన్ తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.


 పదిహేనవ ఓవర్ వరకు క్రీజులో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ అంతలోనే వికెట్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే అంత సేపటివరకు క్రీజులో ఉండి మ్యాచ్ ముగించ లేకపోయినందుకు నిరాశకు లోనైనట్లు తెలిపాడు. 15 ఓవర్ల పాటు క్రీజులో ఉండి విజయానికి మరో 20 పరుగులు అవసరమైన వేళ క్రీజ్లో కుదురుకున్నా బ్యాట్స్మెన్  మ్యాచ్ ముగించాలని అని ఎవరైనా అనుకుంటారు.. ఈరోజు నేను ఆ పని చేయలేక పోయాను. అందుకే నిరాశకు లోనయ్యా.. తదుపరి మ్యాచ్ లలో వెనక్కి తగ్గేది లేదు. ఇదే తరహా దూకుడైన ఆటతోనే ముందుకు సాగుతాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒక మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడినంత మాత్రాన పొంగి పోను అంటూ తెలిపాడు. మళ్లీ 0 నుంచి మొదలు పెడతా అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: