కొన్ని కొన్ని సార్లు ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో మెరుపువేగంతో కదిలిన ఫీల్డర్లు పట్టే క్యాచ్ లు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూపర్ మ్యాన్ లాగానే  గాల్లోకి ఎగురుతూ అసాధ్యమనుకున్న క్యాచ్ ని ఎంతో అలవోకగా పట్టేస్తూ ఉంటారు క్రికెటర్లు. ఇక ఇలాంటి క్యాచ్లు పట్టిన సమయం లో ఆశ్చర్యానికి గురి కావడం అటు ప్రేక్షకుల వంతు అవుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన క్యాచ్ కి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ క్రికెటర్ కి సూపర్ మ్యాన్ పూనడేమో అని అనిపిస్తూ ఉంటుంది.


 ఎందుకు అంటారా ఆ రేంజ్ లో గాల్లోకి జంప్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వావ్ అనకుండా ఉండలేకపోతున్నారూ అని చెప్పాలి. ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్ షా రాయల్ లండన్ వన్ డే కప్ లో భాగంగా ఈ అద్భుతమైన క్యాచ్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. సోమర్సెట్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ ఆటగాడు. ఇక ఈ టోర్నీలో భాగంగా ఇటీవల సర్రే తో జరిగిన మ్యాచ్ లో సంచలన క్యాచ్ తో అభిమానుల అందరిని కూడా ఆశ్చర్యంలో ముంచేశాడు.


 సర్రే ఇన్నింగ్స్ సమయంలో ఆల్ట్ రైడ్జ్ బౌలింగ్లో  బ్యాట్స్మెన్ ర్యాన్ పటేల్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని చివరికి సెకండ్ స్లిప్ దిశ గా వెళ్ళింది. ఈ క్రమంలోనే గ్యాప్ లో పడి ఇక ఫోర్ వెళ్లడం ఖాయం అని అందరూ అనుకున్నారు.  ఐతే సెకండ్ స్లిప్ లో ఫీలింగ్ చేస్తున్నా మాట్ రెన్ షా గాల్లోకి డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్ తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ తో అటు సహచర ఆటగాళ్లు మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. సూపర్ మ్యాన్ క్యాచ్ పడితే ఇలాగే ఉంటుందేమో అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: