
అయితే అటు ఐపీఎల్ కారణంగా భారత ప్రేక్షకులకి కూడా ఎంతగానో దగ్గరయ్యాడు అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగిన ఎబి డివిలియర్స్ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తో స్నేహ బంధాన్ని కూడా కొనసాగించాడు. ఇక వీరిద్దరిని చూసినప్పుడల్లా అభిమానులు అందరూ మురిసిపోతూ ఉంటారు. అయితే గత ఏడాది క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఒక గొప్ప పనికి పూనుకున్నాడు. భారతదేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఎన్జీవో లో ఒకటైన మేక్ ఏ డిఫరెంట్ కు సహకారం అందించడానికి సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది.
వెనుక బడిన పిల్లలను కెరియర్ మెరుగుపరిచేందుకు ఈ ఎన్జీవో పనిచేస్తూ ఉంటుంది. వృత్తిలో నిలదొక్కుకోవడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటుంది ఈ ఎన్జీవో. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా డివిలియర్స్ లక్నోకు చెందిన 18 ఏళ్ల అయాన్ ను దత్తత తీసుకున్నాడు అని తెలుస్తుంది. అతడు అండర్-19 క్రికెట్ ఆడాలి అనుకుంటున్నాడు. అలాగే 21 ఏళ్ల జర్నలిజం విద్యార్థి అయిన అనితను కూడా కెరియర్లో నిలదొక్కుకోవడానికి కావాల్సిన సహకారం అందించేందుకు సిద్ధమయ్యాడు ఎబి డివిలియర్స్. ఇన్నాళ్ళు భారత్ నుంచి ఎంతో పొందాను ప్రతిఫలంగా ఏదైనా చేయాలనే కార్యక్రమానికి పూనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.