గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పేలవమైన ఫాం అందరినీ కలవరపెడుతోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీమిండియాను కష్టాల్లోకి నెడుతోంది. ఒకప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ ఇండియా కష్టాల్లో ఉన్న సమయంలో కూడా ఒంటిచేత్తో విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సాదాసీదా ఇన్నింగ్స్ ఆడటానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నాడు అని చెప్పాలి. తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయి అభిమానులందరినీ కూడా తీవ్రస్థాయిలో నిరాశపరుస్తూ ఉన్నాడు విరాట్ కోహ్లీ.


 ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు ఆసియా కప్ లో భాగంగా మళ్ళీ జట్టుతో చేరాడు. ఈ క్రమంలోనే అతను ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఆసియా కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు విరాట్ కోహ్లీ కెరియర్లో అది వందవ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. ఇలా 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ గురించి బిసిసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ ప్రస్తుతం కేవలం దేశం కోసం మాత్రమే కాదు తన కోసం తాను కూడా పరుగులు సాధించాల్సిన అవసరం ఉంది అని ఒకరకంగా విరాట్ కోహ్లీ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ తప్పకుండా ఫామ్ లోకి వస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే చూడాలని ఉంది అంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించడం గమనార్హం. టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు ఆసియా కప్ రూపంలో వచ్చిన అవకాశాన్ని విరాట్ కోహ్లీ సద్వినియోగం సౌరబ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: