మొదటి మ్యాచ్లో భాగంగా ఓటమి చవిచూసిన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. అదే సమయంలో మొదటి మ్యాచ్లో విజయం సాధించి ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉన్న భారత జట్టు ఈసారి కూడా పాకిస్థాన్పై మాదే విజయం అంటూ ధీమాగా చెబుతోంది. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో అద్భుతమైన ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో తీవ్రంగా ప్రాక్టీస్ లో మునిగిపోయాయి ఇరుజట్లు. అయితే అటు టీమిండియాను మాత్రం జట్టు కూర్పు సమస్య వేధిస్తోంది. ఎంతో నమ్మకంతో జట్టులోకి తీసుకున్న ఆవేష్ ఖాన్, అర్ష దీప్ సింగ్ లు ఆసియా కప్లో భాగంగా దారుణంగా విఫలం అవుతున్నారు.
ఓపెనర్లుగా ఉన్న కె.ఎల్.రాహుల్ రోహిత్ శర్మలు కూడా బ్యాట్ తో మెరవలేక పోతున్నారూ అని చెప్పాలి. పాకిస్తాన్ తో మ్యాచ్ లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అవేశ్ ఖాన్, అర్ష దీప్, కేఎల్ రాహుల్ లను జట్టులోకి తీసుకుంటే మాత్రం ఈ ముగ్గురు టీమిండియా ని ముంచే అవకాశం ఉంది అని ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిని తీసుకోవడం వల్ల భారత జట్టు తమ చేతితో తమ కంటినే పొడుచుకున్నట్లు అవుతుందని మరి కొంతమంది అంటున్నారు. మరి నేడు జరగబోయే మ్యాచ్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి