మొన్నటివరకు టీమిండియా ఎంతో పటిష్టంగా కనిపించింది . బౌలింగ్లో  ఫీల్డింగ్ లో కూడా తిరుగులేదు అని నిరూపించింది. ఇక బ్యాట్స్మెన్లు అప్పుడప్పుడు తడబడ్డ కాస్త ఫర్వాలేదు అని పిలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అటు టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో ఇక టీమిండియాకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. సొంత గడ్డపై ఆస్ట్రేలియా సౌతాఫ్రికా టీ20 సిరీస్ లో ఆడుతుంది.


 ఇందులో టీమిండియా తమ బెస్ట్ కాంబినేషన్ సెట్ చేసుకోవడమే కాదు టీమిండియా తప్పిదాలను తెలుసుకుని వాటిని పునరావృతం చేసుకోకుండా చూడాలి. ఇటీవలే టీమ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కీలక బౌలర్లు అనుకున్న హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ చెత్త బౌలింగ్  ఇండియా ఓటమికి కీలకంగా మారారు అని చెప్పాలి. అయితే జస్ప్రిత్ బూమ్రా లేక పోవడంతో అతని స్థానంలో ఉమేష్ యాదవ్ తీసుకున్నారు. అతను తన బౌలింగ్తో పర్వాలేదనిపించాడు. రెండు వికెట్లు కూడా తీశాడు.


 కానీ ఆ తర్వాత మాత్రం అతనికి మరో రెండు ఓవర్లు ఇవ్వక పోవడం వెనుక రోహిత్ అంతరం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఇక భారత్ ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అని చెప్పాలి. ఎందుకంటే 3 విలువైన క్యాచ్ లను టీమిండియా ఫీల్డర్లు వదిలేశారు. ఈ క్యాచ్ లే టీమిండియాను విజయానికి దూరం చేసాయి అని చెప్పాలి. అక్షర్ పటేల్, కె.ఎల్.రాహుల్, హర్షల్ పటేల్ సులువైన క్యాచ్ లను వదిలేసి చివరికి మూల్యం చెల్లించుకున్నారు. అయితే పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం టీమిండియా ఆస్ట్రేలియా సిరీస్ కోల్పోవడం మాట పక్కన పెడితే ఇక వరల్డ్ కప్లో లీగ్ దశతో సరిపెట్టుకోవడం ఖాయమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: