ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ప్రత్యర్థి  ఆస్ట్రేలియా జట్టు పై ఆదిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియ.. రెండు ఒకటి తేడాతో ఆదిత్యాన్ని కొనసాగించింది. టి20 సిరీస్ కైవసం చేసుకుంది.. ఈ క్రమంలోనే భారత అభిమానులు అందరినీ కూడా ఆనందంలో ముంచేసింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆస్ట్రేలియా లాంటి మేటి టీం ను ఓడించడంతో టి20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియాకు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడం ఖాయం అన్నది ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా మ్యాచ్లో  ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.


 ఈ క్రమంలోని 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.  19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది అని చెప్పాలి. తనకు కలిసి వచ్చిన మైదానంలో మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ ఝలిపించాడు. 48 పంతులలో 63 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. మరోవైపు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఎప్పటిలాగే తన బ్యాటింగ్ తో  అద్భుతం చేశాడు. 36 బంతుల్లోనే ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో 69 పరుగులు చేశాడు అని చెప్పాలి. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా ఎప్పటిలాగానే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి 25 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు.


 అయితే మూడో టి20 మ్యాచ్ లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్  మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజంగా ఇది మంచి సిరీస్. మేము మ్యాచ్లో ఒకానొక సమయంలో వెనకబడినప్పటికీ తిరిగి కంబ్యాక్ అయ్యి పోరాడాము. ఇక ఈ మ్యాచ్లో కేమరూన్ గ్రీన్ లాంటి యువ ఆటగాడికి ఎంత ప్రతిభ ఉందో మేము కళ్లారా చూసాం. ఇక మేము మరో రెండు మూడు వికెట్లు తీయాల్సింది. ఇలా జరగకపోవడమే మా ఓటమికి కారణమైంది. భారత్ లాంటి జట్టుపై డాట్ బాల్స్ ద్వారా మాత్రమే విజయం సాధించలేము. తప్పకుండా వికెట్లు తీస్తేనే గెలుపు వరిస్తుంది అంటూ అరోన్ పించ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: