టీమిండియా విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో కూడా విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అయితే లక్ష చేదనలో కీలకమైన బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు విఫలమైనప్పటికీ కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ లు మాత్రం అర్థ శతకాలతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించారు. ఇక టీమిండియా బౌలింగ్ విభాగం కూడా అద్భుతమే చేసింది అని చెప్పాలి. తద్వారా సమిష్టిగా రాణించిన జట్టు విజయం సాధించింది.


 ఇకపోతే మొదటి టి20 మ్యాచ్ కు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి. కాగా ఇటీవల విరాట్ కోహ్లీ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మ్యాచ్ విజయ అనంతరం తిరువనంతపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు టీమిండియా ఆటగాళ్లు.  ప్రత్యేకమైన బస్సులో బయలుదేరారు.  అయితే టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు అప్పటికే అభిమానులు హోటల్ బయట గుమిగూడారు.  భారత క్రికెటర్లు బస్సు ఎక్కగానే ఇక కేరింతలు కొట్టారు.


 విరాట్ కోహ్లీని చూడగానే అభిమానుల్లొ మరింత జోష్ వచ్చింది. దీంతో కోహ్లీ కోహ్లీ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే ఇలా అభిమానులు అరుస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు.  ఇక అంతలో అభిమానులు అరవడంతో స్పందించిన విరాట్ కోహ్లీ బస్సు అద్దంలో నుంచి అనుష్కతో వీడియో కాల్ లో ఉన్నాను. డిస్టర్బ్ చేయకండి అన్నట్లుగా ఫోన్ చూపిస్తూ నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా అక్టోబర్ రెండవ తేదీన ఆదివారం రెండవ టి20 మ్యాచ్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: