విరాట్ కోహ్లీకి ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా ఆటగాడిగా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఇక ఆ తర్వాత తన బ్యాటింగ్ ప్రతిభతో దిగ్గజ ఆటగాడుగా ఎదిగాడు అని చెప్పాలి. ఎంతోమంది లెజెండరీ ప్లేయర్స్ క్రియేట్ చేసిన రికార్డులను ఎంతో అలవోకుగా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.  ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలాంటి విరాట్ కోహ్లీకి అటు అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పాలి.


 అటు రికార్డుల పరంగా చూసుకున్నప్పటికి విరాట్ కోహ్లీ మిగతా ఆటగాళ్లతో పోల్చి  చూస్తే అందనంత ఎత్తులో ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ మహేంద్రసింగ్ ధోని నుంచి అటు కెప్టెన్సీ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే  జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వరల్డ్ కప్ గెలిపించలేకపోయాడు అన్న ఒక్క మార్క్ తప్ప.. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో అద్వితీయమైన విజయాలు సాధించింది అన్నది మాత్రం అందరికీ తెలిసిన నిజం.


 ఇక విరాట్ కోహ్లీని గొప్ప కెప్టెన్ గా కూడా ఎంతోమంది అభివర్ణిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కోహ్లీ కెప్టెన్సీ గురించి వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడూ. టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీని గొప్ప కెప్టెన్గా తాను పేర్కొనలేను అంటు చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ మాజీ ఫేసర్  విన్ స్టెన్ బెంజిమిన్. అతను బ్యాటింగ్ పై మరింత దృష్టి పెడితే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ కన్నా ముందు కెప్టెన్సీ వహించినవారు జట్టును  వ్యూహాత్మకంగా నడిపించడంలో  ఎంతో మెరుగైన వారూ అంటూ తెలిపాడు. అయితే ఒక బ్యాట్స్మెన్ గా మాత్రం విరాట్ కోహ్లీ అత్యుత్తమమైన ఆటగాడు అంటూ కితావిచ్చాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: