ప్రస్తుతం ఇండియా వేదికగా సౌత్ ఆఫ్రికా , భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. అయితే అంతకుముందు సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 సీరీస్ లో వరుసగా రెండు విజయాలు సాధించి సత్తా చాటిన టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. కానీ వన్డే సిరీస్ లో మాత్రం అలాంటి శుభారంభం చేయలేకపోయింది టీమిండియా. ప్రస్తుతం వరల్డ్ కప్ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు అందరికీ కూడా విశ్రాంతి ఇచ్చిన నేపథంలో ప్రస్తుతం ఇక శిఖర్ ధావన్ కాప్టెన్సీలో బరిలోకి దిగింది టీమిండియా.


 అయితే ఇప్పటికే శిఖర్ ధావన్ టీమిండియా కు కెప్టెన్సీ వహించి పలుమార్లు వన్డే సిరీస్ లలో విజయం అందించాడు. ఇక ఇప్పుడు కూడా టీమిండియా శుభారంభం చేస్తుంది అని అనుకున్నప్పటికీ ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ క్రమంలోనే నేడు రెండో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండో వన్డే మ్యాచ్ టీమ్ ఇండియాకు ఎంతో కీలకంగా మారబోతుంది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే రెండవ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది. మొదటి మ్యాచ్లో  తప్పులను సరిదిద్దుకొని బలిలోకి దిగేందుకు సిద్ధమైంది టీమిండియా.



 అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు ఆస్ట్రేలియా పయనం అవ్వగా స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగిన వన్డే సిరీస్ కు ఎక్కువ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ దక్షిణాఫ్రికాకు మాత్రం వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ అర్హత సాధించేందుకు ప్రతి మ్యాచ్ గెలుపు ద్వారా లభించే 10 సూపర్ లీగ్ పాయింట్లు ఎంతో అవసరమని చెప్పాలి. దీంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం అనేది తెలుస్తుంది. అయితే మొదటి మ్యాచ్ లో ఫేస్ బౌలర్ దీపక్ సార్ వెన్ను నొప్పితో జట్టు నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: