ఇటీవల కాలంలో భారత క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ ఎంతలా పాపులారిటీ సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వరకు భారత జట్టులో భారీగా పరుగులు చేసిన బ్యాట్స్మెన్లు చాలామంది ఉన్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ లాగా మైదానా నలువైపులా ఎంతో అలవోకగా షాట్లు ఆడగలిగిన బ్యాట్స్మెన్లు మాత్రం ఎవరూ లేరు అని చెప్పాలి. అతనిలాగా అందరిని ఆశ్చర్యపరిచే షాట్ లను ఆడటం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏ బంతిని ఎటువైపు బౌండరీ తరలిస్తాడు అన్నది కూడా బౌలర్ కి కూడా ఊహకందని విధంగానే ఉంటుంది.


 అందుకే అతనికి 360 డిగ్రీస్ ప్లేయర్ అని అభిమానులు ఒక అరుదైన బిరుదు కూడా ఇచ్చారు అని చెప్పాలి. ఇక ప్రతి ఇన్నింగ్స్ లో కూడా ఆ బిరుదును తన బ్యాటింగ్ తో సార్ధకం చేస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇకపోతే ఇటీవల టీమిండియా జట్టులో సూర్యకుమార్ కాకుండా మరో యువ ఆటగాడు అచ్చం ఎస్ కే వై తరహాలోనే అదిరిపోయే షాట్లతో ఆకట్టుకున్నాడు. సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోకి వచ్చాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.


 అప్పటికే ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కు వాషింగ్టన్ సుందర్ సింగిల్స్ తీసి ఇస్ స్ట్రైక్ ఇస్తాడని అందరూ భావించారు. కానీ ఊహకందని విధంగా తన బ్యాటింగ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు వాషింగ్టన్ సుందర్. 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు చివర్లో వచ్చి 231 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డును  పరుగులు పెట్టించాడు. కాగా న్యూజిలాండ్  తరఫున మాట్ హెండ్రీ అత్యుత్తమ బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇక అతని బౌలింగ్ లోనే వాషింగ్టన్ సుందర్ భారీ షాట్లు ఆడటం గమనార్హం. రెండు ఫోర్లతో పాటు ఒక అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అయితే మార్క్ హెండ్రీ వేసిన బంతిని సుందర్  అలవోకగా  బౌండరీ తరలించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా సూర్య కుమార్ లాగా స్కూప్ షాట్ ఆడాడు. ఇక ఈ షాట్ చూసిన తర్వాత అందరూ సుందర్ ని సూర్యకుమార్ తో పోలుస్తూ ఉండటం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: