టీమిండియాలో ప్రతిభగల యువ ఆటగాడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రిషబ్ పంత్. ఏకంగా భారత జట్టులోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని వారసుడు అంటూ అందరిలో నమ్మకాన్ని కలిగించాడు. ఎందుకంటే ధోని లాగా వికెట్ కీపింగ్ చేయడమే కాదు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం ద్వారా ఇక ఇలాంటి ట్యాగ్ రిషబ్ పంత్ కు వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక ధోని వారసుడు అన్న పేరును మాత్రం రిషబ్ పంత్  ఎప్పుడూ నిలబెట్టుకోలేకపోయాడు.


 రిషబ్ పంత్ మంచి ప్రదర్శన చేసిన అతని బ్యాటింగ్ మెరుపులు మాత్రం కేవలం రెండు మూడు మ్యాచ్లకే పరిమితం అయ్యాయి అని చెప్పాలి. ఇకపోతే గత కొంతకాలం నుంచి టీమిండియా  యాజమాన్యం రిషబ్ పంత్ కి   వరుసగా అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ అతను మాత్రం విఫలమవుతూనే ఉన్నాడు. పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు టీమిండియా అభిమానులు.


 మాజీ ఆటగాళ్లు సైతం రిషబ్ పంత్ ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ గురించి మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజుల నుంచి రిషబ్ పంత్ ప్రదర్శన తీవ్రంగా నిరాశ పరుస్తుంది. రిషబ్ పంత్ కి  కాస్త విరామం ఇవ్వాల్సిన సమయం ఇది. అతడికి విరామం ఇచ్చి రెండు మ్యాచ్లకు దూరం చేయడమా లేక రెండు మ్యాచ్లు ఆడించి తొలగించడమా అన్నది యాజమాన్యం ఒకసారి ఆలోచించుకోవాలి.. ఎన్నడా  పంత్.. ఇలా అయితే ఎలా అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ కామెంట్ చేశాడు. అయితే మిగతా ఆటగాళ్లను కాదని రిషబ్ పంత్ కు వరుస అవకాశాలు ఇస్తూ ఉండడం పై కూడా విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: