గత కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ పేరు మారుమోగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీమిండియా తరఫున కాస్త ఆలస్యంగా అరంగటం చేసిన సూర్య కుమార్ యాదవ్ ఏకంగా తన బ్యాటింగ్ తీరుతో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా సూర్యకుమార్ బ్యాటింగ్ చూసి ఏకంగా మంత్రముగ్ధులు అవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని మొత్తం తన వైపు తిప్పుకుంటున్నాడు సూర్య కుమార్.


 అంతేకాదు మిస్టర్ 360 ప్లేయర్ అనే ఒక అరుదైన బిరుదును కూడా అందుకొని.. ఇక ఆ బిరుదుకు తన ఆట తీరుతో సార్ధకం చేస్తున్నాడు అని చెప్పాలి. మైదానం నలువైపులు కూడా ఎంతో అలవోకగా షాట్లు ఆడుతూన్న సూర్య కుమార్.. తనను అడ్డుకునే బౌలర్ లేడేమో అని అనిపించేంతలా విద్వంశం సృష్టిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందించి సూర్య కుమార్ యాదవ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించడం చూసాం.  కానీ ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఒక్క విషయంలో సూర్య కుమార్ యాదవ్ మరిత మెరుగుపడాల్సిన అవసరం ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వసీం జాఫర్. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా సూర్యకుమార్ అవుట్ అయిన తీరుపై స్పందించాడు వసీం జాఫర్. టి20 లో స్లిప్ ఫీల్డర్లు ఉండరు కాబట్టి బతికిపోవచ్చు. ఈ విషయంలో సూర్య కుమార్ యాదవ్ మరింత మెరుగుపడాలి. లేకపోతే  సూర్యకుమార్ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్లో ఎలా ఆడతాడు అని అనుమానం వ్యక్తం అవుతుంది అంటూ వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవల  న్యూజిలాండ్తో  జరిగిన వన్డే సిరీస్ లో రెండు వన్డే మ్యాచ్ లలో కూడా స్లిప్లో ఉన్న ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు సూర్యకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: