సాధారణంగా క్రికెటర్లు ఒకసారి ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎంతో లగ్జరీ లైఫ్ కడుపుతో ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇతర దేశాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు ఇక వారి విమాన ప్రయాణాల దగ్గర నుంచి వారు బస చేసే హోటల్ వరకు కూడా అన్ని లగ్జరీ గానే ఉంటాయి. దీంతో లైఫ్ అంటే క్రికెటర్లలా ఉండాలి అని ఎంతో మంది అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. కానీ ఇక ఇలా ఎంతో లగ్జరీతో కూడిన ఆతిథ్యాన్ని దక్కించుకునే క్రికెటర్లకు కూడా అప్పుడప్పుడు చేదు అనుభవం ఎదురవుతుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇలా క్రికెటర్లకు ఎవరైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటే చాలు ఇక వాటిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కాగా టీం ఇండియాలో ప్లేయర్గా కొనసాగుతున్న దీపక్ చాహార్ సైతం ఇలాంటి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు అని చెప్పాలి. ఎయిర్ లైన్స్ లో తనకు ఎదురైన దారుణమైన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు దీపక్ చాహార్. ఈ క్రమంలోనే అతను పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ టి20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ఆడింది టీం ఇండియా. అయితే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ లో పాల్గొన్న కొంతమంది క్రికెటర్లు ఇక బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళిన సీనియర్లతో కూడిన జట్టుతో చేరారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ నుంచి బంగ్లాదేశ్ సిరీస్ కోసం నేరుగా డాకా చేరుకున్నారు అని చెప్పాలి. అయితే మలేషియా ఎయిర్ లైన్స్ లో తనకు దారుణమైన చేదు అనుభవం ఎదురయింది అంటూ దీపక్ చాహార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాకు సమాచారం ఇవ్వకుండా ప్లేట్ మార్చారు. బిజినెస్ క్లాస్ లో ప్రయాణించినప్పటికీ కనీసం ఫుడ్ కూడా ఇవ్వలేదు. మ్యాచ్ కి ఒకరోజు ముందు కూడా లగేజ్ రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు దీపక్ చాహార్.

మరింత సమాచారం తెలుసుకోండి: