అయితే నాలుగు మ్యాచ్ లలో అటు టీమిండియా మహిళల జట్టు కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది అని చెప్పాలి. ఇలా ఏకం గా భారత జటను ఇక సొంతగడ్డ పైన చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు ఇక ఇప్పుడు మరో మ్యాచ్ లో విజయం సాధించడమే లక్ష్యం గా ముందుకు సాగుతూ ఉంది. కాగా నేడు ఇక ఐదు మ్యాచ్ టీ20 సిరీస్ లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సిరీస్ ఎవరు గెలుచుకున్నారు అన్న విషయం తేలిపోవడంతో ఇక ఇది కేవలం నామమాత్రమైన మ్యాచ్ గానే మారిపోయింది.
అయితే ఆస్ట్రేలియా చేతి లో మూడు మ్యాచ్లు ఓడిపోయి కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించిన భారత జట్టు ఇక ఆఖరి మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తూ ఉంది అని చెప్పాలి అదే సమయం లో ఇప్పటికీ సిరీస్ గెలిచిన జోరు లో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇక చివరి మ్యాచ్లో కూడా విజయం సాధించి తమ అధిపత్యాన్ని సాధించాలని చూస్తుంది. ఈ క్రమం లోనే నేడు జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి