ప్రస్తుతం భారత టెస్టు జట్టులో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ గురించిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ లో మీర్ పూర్ వేదికగా జరిగిన టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఇక భారత జట్టు ఓడిపోవడం ఖాయం అనుకున్న పరిస్థితి నుంచి ఇక తన అద్భుతమైన బ్యాటింగ్ తో విజయ తీరాలకు చేర్చాడు అని చెప్పాలి. ఒకవేళ రవిచంద్రన్ అశ్విని గనక లేకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఊహించుకోవడానికి భారత అభిమానులు భయపడిపోతున్నారు.

 ఇలా మంచి ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును గెలిపించి సిరీస్ గెలుచుకునేలా చేసిన రవిచంద్రన్ అశ్విని పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది అని చెప్పాలి. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ రవిచంద్రన్ అశ్విన్ అసమాన్యమైన ఆటగాడు అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ ప్రతిభ పై స్పందించిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న రోజుల్లో భారత టెస్ట్ కెప్టెన్సీకి అశ్విన్ కూడా మంచి ఎంపీక అవుతాడు అంటూ  కనేరియా అభిప్రాయం వ్యక్తం చేశాడు అని చెప్పాలి.


 బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా అశ్విన్ ఎంతో చురుగ్గా రాణించగలడు అంటూ ప్రశంసలు కురిపించాడు. భారత టెస్ట్ కెప్టెన్సీకి అన్ని విధాల అర్హత కలిగిన ఆటగాళ్లలో అటు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకరు. అతనిలో ఇంకా చాలా క్రికెట్ దాగి ఉంది. బ్యాటింగ్లో బౌలింగ్లో అతని తెలివితేటలు చురుకుదరం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక అందరికంటే ఎక్కువ మైదానంలో అతడే ఆలోచిస్తాడేమో అనిపిస్తుంటుంది. ఇక భారత్ ఒత్తిడిలో ఉన్నప్పుడు అశ్విన్ మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాడు. ఇక చాలా సందర్భాల్లో అశ్విన్ తన బ్యాటింగ్ తో టీమ్ ఇండియాను గట్టేక్కించాడు. ఇటీవల అతను చేసిన 42 పరుగులు సెంచరీ తో సమానం అంటూ డానిష్ కానేరియా ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: