సొంత గడ్డపై టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఈ టి20 సిరీస్ లో భాగంగా హాట్ ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగింది. అయితే అదే సమయంలో శ్రీలంక జట్టును కూడా తక్కువ అంచనా వేయడం పెద్ద తప్పుగా మారుతుందని అటు క్రికెట్ విశ్లేషకులు కూడా టీమ్ ఇండియాను హెచ్చరిస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే శ్రీలంక టీం లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు ఉన్నారు అని చెప్పాలి. ఈ ఆటగాళ్లలో ఆవిష్క ఫెర్నాడో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన లంకా ప్రీమియర్ లీగ్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఆవిష్క ఫెర్నాండో.
లంకా ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు అని చెప్పాలి. ఏకంగా 10 మ్యాచ్ లలో కలిపి 339 పరుగులు చేశాడు ఆవిష్క ఫెర్నాడో. అతని బ్యాట్ నుంచి 6 సిక్సర్లు 37 ఫోన్లు వచ్చాయి. ఇక ఇందులో అవిష్క ఫెర్నాండో మూడు అర్థ సెంచరీలు చేశాడు అని చెప్పాలి. కాగా ఇక లంక ప్రీమియర్ లీగ్ లో భాగంగా అతను ప్రాతినిధ్యం వాకిస్తున్న జట్టు జాఫ్నా కింగ్స్ ఛాంపియన్గా అవతరించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా అద్భుతమైన బ్యాటింగ్ తో కొనసాగుతున్న అవిష్కా ఫెర్నాండో ఇక ఇప్పుడు టీమిండియా పై కూడా మెరుపు బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక అతను ఎలా రాణిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి