ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో మన్ కడింగ్ అనేది ఎంత వివాదాస్పదంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా జట్టులో సీనియర్ స్పిన్నర్ గా  కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో బట్లర్ ను మన్ కడింగ్ చేయడం ద్వారా ఇక ప్రపంచ క్రికెట్లో ఇలాంటి ఒక రూల్ ఉంది అన్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేశాడు. ఇక ఆ తర్వాత ఇక ఎంతోమంది క్రికెటర్లు కూడా మన్ కడింగ్ ద్వారా రన్ అవుట్లు చేయడం లాంటివి చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు అని చెప్పాలి.


 బౌలర్ బంతిని రిలీజ్ చేయకముందే క్రీజులో ఉన్న బ్యాట్స్మెన్ క్రీజు దాటి వెళితే అప్పుడు బౌలర్ ఏకంగా వికెట్లను గిరాటేసి మన్ కడింగ్ ద్వారా రన్ అవుట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది ఐసీసీ రూల్స్ ప్రకారం అఫీషియల్ అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం మన్ కడింగ్ చేయడం అనేది క్రీడా స్ఫూర్తిగా విరుద్ధం అంటూ విమర్శలు చేయడం చేస్తూ ఉంటారు.  కాగా ఇటీవలే  శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా భారత బౌలర్ మహమ్మద్ షమీ మన్ కడింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక ఇదే విషయం గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవలే వివాదాస్పద మన్ కడింగ్ గురించి దిగజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. నిజానికి అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం మన్ కడింగ్ న్యాయబద్ధమే అంటూ వ్యాఖ్యానించాడు. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని భావించడం సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరైనా మన్ కడింగ్ చేస్తే మాత్రం సమర్థిస్తానని చెప్పుకొచ్చాడు. కానీ తాను మాత్రం మన్ కడింగ్ చేయను అంటూ తెలిపాడు. ఇకపోతే గతంలో అర్జున్ తండ్రి సచిన్ కూడా మన్ కడింగ్ విధానాన్ని సమర్థించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: