ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తో సృష్టిస్తున్న విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. అసమాన్యమైన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఇక తన అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో అంతకంతకు పైకి దూసుకుపోయి ఇక ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నాడు అని చెప్పాలి. ఇక టి20 ఫార్మాట్లో అతనికంటే మెరుగైన బ్యాట్స్మెన్ ఇంకెవరూ లేరు అనే విధంగా తన ప్రదర్శనతో నిరూపిస్తున్నాడు.


 అయితే ఇక ఇలా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్న సూర్య కుమార్ యాదవ్కు అటు వన్డే ఫార్మాట్లో కూడా వరుసగా అవకాశాలు దక్కుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే టి20 ఫార్మాట్లో తిరుగులేని బ్యాట్స్మెన్ గా మారిన సూర్య కుమార్ యాదవ్ ఎందుకో వన్డే ఫార్మాట్లో మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు అని చెప్పాలి. దీంతో సూర్యకుమార్ కేవలం పొట్టి ఫార్మాట్కు మాత్రమే సరిపోతాడా అనే అనుమానం అభిమానుల్లో కూడా వస్తుంది.


 ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  టి20 లో అద్భుతంగా రానిస్తున్న సూర్య కుమార్ వన్డేలో విఫలమవుతున్నాడు. దీనికి కారణం సూర్య బలహీనతలే అంటున్నాడు మహమ్మద్ కైఫ్. సూర్య అద్భుతమైన ప్లేయర్ అనడంలో సందేహం లేదు. అయితే టెస్టులు వన్డేలు టీ20 లు వేటికి అవే ప్రత్యేకం.  ఒకరకంగా వన్డే  ఫార్మాట్ అనేది ఒక రకంగా సుదీర్ఘమైన ఆట. అందుకే సూర్యకుమార్ వన్డేలకు అలవాటు పడాలి. ఆఫ్ స్టంప్ కి అవతలపడే బంతులను ఎదుర్కోవడం.. కవర్స్ లో షాట్లు ఆడటంలో సూర్యకుమార్ ఇబ్బంది పడుతున్నాడు. ఈ బలహీనతలను అధిగమిస్తే అతనికి తిరుగుండదు అంటూ మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: