
ఇక అదే జోరుతో శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వన్డే సిరీస్ లో కూడా టీమ్ ఇండియా జోరు కొనసాగుతుంది అని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగానే టీమిండియా ప్రదర్శన కూడా చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. మూడో మ్యాచ్‌లో అయినా అటు న్యూజిలాండ్ గెలిచి పరువు నిలబెట్టుకుంటుందని భావించిన ఇక అందుకు అవకాశం ఇవ్వలేదు టీమ్ ఇండియా. మూడో మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసి 3-0 తేడాతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది.
ఓటమిపై మాట్లాడిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో జరిగిన సిరీస్ లో మూడు మ్యాచ్‌లలో ఓడిపోవడం ప్రపంచ కప్ కు ముందు తమకు ఒక మంచి గుణపాఠం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ లో ఎదురైన కఠిన పరిస్థితులు ఎంత ఎక్కువగా ఎదుర్కొంటే అంత నేర్చుకొనే అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. మేము బంతితో శుభారంభం అందుకోలేకపోయాం. ప్రణాళికలకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడంలో విఫలం అయ్యాం. రోహిత్, గిల్ ఓపెనింగ్ జోడి అసాధారణ రీతిలో చెలరేగారు. ఇక బ్యాటింగ్ లో వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం అంటు చెప్పుకొచ్చాడు.