
ప్రత్యర్థి ఆటగాళ్ల మీదికి దూసుకుపోతూ ఏకంగా దాడి చేసినంత పని చేస్తూ ఉంటారు. ఇలా నియమ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించారు అంటే చాలు ఇక వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా మ్యాచ్ రిఫరీలు సిద్ధమవుతూ ఉంటారని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఇలా ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ మ్యాచ్ రిపరీలుగా ఉన్న వ్యక్తుల జోలికి దాదాపు ఆటగాళ్లు వెళ్లిన చిన్న చిన్న గొడవలతో సరిపెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా మ్యాచ్ రిఫరీ పై పిడుగుద్దులు కురిపించాడు ఒక ప్లేయర్.
ఫాన్స్ లో ఒక ఫుట్బాల్ మ్యాచ్లో ప్లేయర్ రిఫరీని కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా నిబంధనలకు విరుద్ధంగా రిఫరీ పై చేయి చేసుకున్న ప్లేయర్ ను 30 ఏళ్ల పాటు ఫుట్ బాల్ నుంచి బ్యాన్ చేసినట్లు లాయి రేట్ ఫుట్బాల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బెనోయిట్ లైన్ తెలిపాడు. అయితే ఆ ప్లేయర్ ఎవరన్నది చెప్పకపోయినాప్పటికీ ఎంటెంటే స్పోర్టివ్ గాటి నైస్ క్లబ్ తరఫున ఆడుతున్నట్లు పేర్కొన్నారు. ప్లేయర్ పిడి గుద్దులకు రిఫరీ రెండు రోజులపాటు కనీసం ఆసుపత్రి బెడ్ నుంచి కూడా లేవలేని పరిస్థితిలోకి వెళ్లిపోయాడట.