
ఈ క్రమంలోనే రిషబ్ పంత్ మొన్నటి వరకు కూడా అటు ముంబైలోని కోకిల బెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఇక అతనికి కీలకమైన సర్జరీలు కూడా జరిగాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడిప్పుడే రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల మోకాలి సర్జరీ సక్సెస్ కావడంతో ఇక అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు అనేది తెలుస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో రిషబ్ పంత్ కు మరో సర్జరీ చేయబోతున్నారట వైద్యులు. ఇకపోతే తన ఆరోగ్యం గురించి ఇటీవల రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోడ్డు ప్రమాదం బారిన పడి ఇక చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు అని చెప్పాలి. బయట కూర్చుని స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటాను అని అస్సలు ఊహించలేదు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు రిషబ్ పంత్. ఇక ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో స్టోరీ లో ఈ క్యాప్షన్ పెట్టాడు అని చెప్పాలి. ఇకపోతే రోడ్డు ప్రమాదం బారిన పడి ఇక ఆసుపత్రి పాలైన రిషబ్ పంత్ దాదాపు ఒక ఏడాది పాటు క్రికెట్కు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు క్రికెట్ నిపుణులు. ఈ క్రమంలోనే టీమిండియా ఆడబోయే కీలకమైన సిరీస్ లకు అతను అందుబాటులో ఉండడు అని చెప్పాలి.