
దీంతో ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ గా రోహిత్ కి జోడిగా ఎవరు వస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేది ఎవరు అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే రోహిత్ కు జోడిగా గిల్ ను ఓపెనర్ గా పంపిస్తేనే టీమ్ ఇండియాకు ప్లస్ పాయింట్ గా మారుతుందని ఎంతోమంది మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన టీమిండియా సారధి రోహిత్ శర్మ జట్టు ఎంపికపై పెద్ద హిట్ ఇచ్చేశాడు.
ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారీస్తున్న గిల్ ను తెగ మెచ్చుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. గిల్ ప్రస్తుతం సుప్రీం ఫామ్ లో ఉన్నాడని.. భారీ సెంచరీలు చేస్తున్నాడంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తాడు. ఇక సూర్య కుమార్ గురించి మాట్లాడుతూ.. జట్టు రేంజ్ లో సూర్య తీసుకొచ్చే మార్పులు ఏంటో ఇప్పటికే చూపించాడు. కానీ ఎవరిని ఆడించాలని విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ మాటలను బట్టి చూస్తే సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓపెనర్ గా కన్ఫార్మ్ అయినట్లే అనేది తెలుస్తుంది. అయితే అసలు పోటీ మాత్రం గిల్, సూర్య మధ్య ఉండబోతుంది అని టాక్.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/శుభ్‌మన్ గిల్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.