ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం అయితే అసమాన్యమైన ప్రదర్శనతో తిరుగులేదు అని నిరూపిస్తూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లకి ముచ్చెమటలు పట్టిస్తుంది అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. ఇకపోతే ఆస్ట్రేలియా భారత్ మధ్య ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో 132 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా.. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లను అదే జోరు కొనసాగించింది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయ డంకా మోగించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు కనీసం మిగతా రెండు మ్యాచ్లు అయినా గెలుస్తుందా లేదా అనే విషయంపై చర్చ మొదలైంది.
ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా జట్టులో అనూహ్యమైన మార్పు జరగబోతుంది. ఆస్ట్రేలియా కెప్టెన్గా ఉన్న ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా పర్యటనను వదిలిపెట్టి స్వదేశానికి వెళ్లబోతున్నాడు. కాగా మూడవ టెస్ట్ మ్యాచ్ ఒకటవ తేదీన ప్రారంభం కానుంది. ఇక అప్పటివరకు అటు ప్యాట్ కమిన్స్ మళ్ళీ జట్టుతో చేరలేడు అని చెప్పాలి. దీంతో మిగిలిన రెండు టెస్టులకు కూడా స్మిత్ కెప్టెన్సీ వహించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే వ్యక్తిగత కారణాలవల్ల స్వదేశానికి పయనం అయిన కమిన్స్ దాదాపు మళ్ళీ వచ్చే అవకాశం లేదట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి