
ఈ క్రమంలోనే ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో ప్రత్యర్థులను వణికించే భయంకరమైన జట్టుగా ఉన్న సౌతాఫ్రికా ఇక ఇప్పుడు ఒక సాదాసీదా టీం గా కొనసాగుతూ ఉంది. సౌత్ ఆఫ్రికా ఏ టీం తో మ్యాచ్ ఆడిన విజయం మాత్రం ప్రత్యర్థికే వరిస్తుంది అనేంతలా పేలవ ప్రదర్శన చేస్తూ ఉంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఇక ఆ దేశ క్రికెట్‌కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు.. జట్టును పటిష్టంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే ఏకంగా జట్టుకు కొత్త కెప్టెన్ నియమించింది సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు.
సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ అయిన మార్కరమ్ కు ప్రమోషన్ ఇచ్చింది అని చెప్పాలి. టి20 ఫార్మాట్‌కు అతన్ని సారధిగా నియమిస్తున్నట్లు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. అయితే వన్డే ఫార్మాట్ కు భావమా కెప్టెన్ గా కొనసాగుతాడు అంటూ తెలిపింది. అంతేకాకుండా వన్డే టీ20 ఫార్మాట్లకు పర్మినెంట్ కోచ్ గా డుమిని కొనసాగుతాడు అంటూ స్పష్టం చేసింది. కాగా మార్కరమ్ అటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ గా ఉండి మొదటి ప్రయత్నంలోనే కప్పు గెలిపించాడు. అతని నాయకత్వ ప్రతిభకు మెచ్చిన సన్‌రైజర్స్ ఐపీఎల్ లో కూడా తమ జట్టు సారధ్య బాధ్యతలను అప్పగించింది. ఇక ఇప్పుడు ఏకంగా సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్సీ చేపట్టే అవకాశం కూడా దక్కించుకున్నాడు మార్కరమ్ .