
గోల్ఫ్ ఆడుతూ కింద పడిన బెయిర్ స్ట్రో పాత గాయం తిరగబెట్టడంతో ఇక ఇంగ్లాండ్ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం రిహాబ్ లో ఉన్నాడు అని చెప్పాలి. అయితే గాయం ఎంతకీ మానకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఐపీఎల్ కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. కాగా పంజాబ్ కింగ్స్ జట్టు కూడా అతన్ని తప్పించి ఇక మరొక ఆటగాడిని తీసుకోవడంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా 2022 మెగా వేలంలో అతన్ని ఏకంగా 9.75 కోట్ల రూపాయల ధర పెట్టి మరి పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇక ఆ డబ్బుకు న్యాయం చేసిన బెయిర్ స్ట్రో గత ఏడాది మంచి ప్రదర్శన కనబరిచాడు అని చెప్పాలి.
అయితే ఇక ఈ బ్యాట్స్మెన్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఇంగ్లాండ్ ప్లేయర్ బెయిర్ స్ట్రో స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ తో భర్తీ చేసేందుకు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం నిర్ణయించింది. గత బిగ్ బాష్ సీజన్ లో ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు గెలుచుకున్న ఆడిలైడ్ స్ట్రైకర్స్ ఆల్ రౌండర్ మాథ్యూ షార్ట్ ను పంజాబ్ కింగ్స్ బెయిర్ స్ట్రో ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేసేందుకు నిర్ణయించిందట. ఇక ఈ విషయంపై ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది అని చెప్పాలి.