ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ఖాయం అనుకున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్లో బోనీ కొట్టింది అని చెప్పాలి. ఒకరకంగా అటు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది అంటే అది ఆల్రౌండర్ శార్దూల్  ఠాగూర్ పుణ్యమే అని చెప్పాలి. ఎన్నడు లేనట్లుగా బ్యాట్ ఝలిపించిన శార్దూల్ ఠాగూర్ సిక్సర్లు ఫోర్ లతో  చెలరేగిపోయి భారీగా పరుగులు చేశాడు.


 మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలం అవుతున్న అతను మాత్రం బాగా రానించాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక అటు కోల్కతా జట్టులో కీలకమైన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న మణిదీప్ సింగ్ మాత్రం డకౌట్ అయ్యి ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. ఐపిఎల్ హిస్టరీలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్మెన్ గా మనిదీప్ సింగ్ ఒక వరస్ట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో ఆర్సిబి బౌలర్ డేవిడ్ మిల్నే బౌలింగ్ వేసాడు. ఇక మొదటి బంతికే మణిదీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.


 దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్ గా మనిదీప్ సింగ్ నిరాశతో పెవిలియన్ చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో మణిదీప్ సింగ్ కి ఇది 15వ డకౌట్ కావడం గమనార్హం. దీంతో అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్గా చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. ఇక మణిదీప్ తర్వాత ఆర్సిబి బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు 14 సార్లు డక్ అవుట్ అయ్యి రెండవ స్థానంలో ఉన్నారు. పార్థివ్  పటేల్, అజింక్య రహనే, అంబటి రాయుడు 13 సార్లు డక్ అవుట్ అయ్యి మూడవ స్థానంలో ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl